సమంత: బ్రైడల్ టియర్స్... పెళ్లి పీటలపై కన్నీరు పెట్టుకున్న సమంత ఫొటోలు!
- భావోద్వేగానికి గురైన సమంత
- ఇన్‌స్టాగ్రామ్‌లో మరిన్ని ఫొటోలు పోస్ట్
- ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియడం లేదన్న పెళ్లికూతురు
నిన్న గోవాలో తన పెళ్లి వేడుకలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. పెళ్లికి వచ్చిన వారితో ఫొటోలు దిగుతూ, డ్యాన్స్ చేస్తూ, మరోపక్క ట్వీట్లు చేస్తూ ఎంతో హుషారుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే, మూడుముళ్లు పడ్డాక పుట్టింటిని వీడే సమయంలో ఏ ఆడపిల్ల అయినా భావోద్వేగాన్ని ఆపుకోలేదు. ఓ గృహిణి అయినందుకు కూడా సంతోషంతో కన్నీరు పెట్టుకోకుండా ఉండలేదు. సమంత కూడా అలాగే పెళ్లి పందిరిలోనే కన్నీరు పెట్టుకుంది.
ఇందుకు సంబంధించిన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియడం లేదని ఆమె పేర్కొంది. పోజులు ఇచ్చి దిగే ఫొటోల కన్నా, ఇటువంటి ఫొటోలు అపురూపంగా ఉంటాయని తెలిపింది. పట్టరాని ఆనందంతో కన్నీరు పెట్టుకున్నానని చెప్పింది.