చంద్రబాబు: పవన్ కల్యాణ్ ట్వీట్ ప్రభావం.. అటువంటి వ్యాఖ్యలు చేయొద్దని తమ నేతలకు చంద్రబాబు ఆదేశం
- అశోక్ గజపతిరాజు, పితానిపై పవన్ వ్యంగ్యంగా ట్వీట్
- చంద్రబాబు నాయుడు ఆరా
- సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు నేతలు జాగ్రత్తగా ఉండాలని హితవు
- పార్టీ అధిష్ఠానం అనుమతి లేనిదే ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణలపై సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 'అశోక్ గజపతి రాజుకి, మంత్రి పితానికి నేను ఎవరో తెలియదట.. సంతోషం' అంటూ పవన్ తన ట్వీట్‌లో చురక అంటించారు.
ఈ ట్వీట్ వచ్చిన వెంటనే, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. తమ పార్టీ నేతలు పవన్‌పై చేస్తోన్న వ్యాఖ్యల గురించి తెలుసుకున్నారు. సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ అధిష్ఠానం అనుమతి లేనిదే ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు.