కేసీఆర్: పరిటాల రవి నా మిత్రుడు.. ఆయన కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పా?: కేసీఆర్

  • తెలంగాణ‌లో టీడీపీ లేదు
  • గతంలో అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్నా
  • నేను లక్షల మంది కార్యకర్తలను తయారుచేశా
  • అందులో కోదండరామ్ ఒకరు

తెలంగాణ‌లో టీడీపీ లేదని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అయినా, ఇక్క‌డున్న కొంద‌రు టీడీపీ నేత‌లు రోజూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారని మండిప‌డ్డారు. టీడీపీ దివంగ‌త నేత ప‌రిటాల ర‌వి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లిన అంశంపై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ప‌రిటాల రవి త‌న‌కు చాలా మంచి మిత్రుడని అన్నారు. మిత్రుడి కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పేంటి? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. గతంలో తాను అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్నానని కేసీఆర్ గుర్తు చేశారు.

కాగా, కోదండ‌రామ్ త‌న‌పై అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్ ను అసలు తయారుచేసిందే తానని వ్యాఖ్యానించారు. రాజకీయ జీవితంలో వేలు, లక్షల మంది కార్యకర్తలను తయారుచేశానని చెప్పారు. అందులో కోదండరామ్ ఒక‌ర‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News