సమంత: ‘మరికొన్ని గంటల్లో నా కోడలు’ అంటున్న నాగార్జున

  • ఓ ఫొటోను పోస్ట్ చేసిన నాగ్
  • చిరునవ్వులు చిందిస్తున్న నాగార్జున - సమంత
  • మరి కొన్ని గంటల్లో వివాహం 

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య-సమంతల వివాహం మరికొన్ని గంటల్లో గోవాలో జరగనుంది. ఇప్పటికే అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు గోవాకు చేరుకున్న విషయం తెలిసిందే. ‘కోడలి కోసం ఎదురుచూస్తున్నాం’ అని నాగార్జున, ‘మావాడిని పెళ్లి కొడుకుని చేశాం’ అంటూ వెంకటేష్, నాగార్జున ట్వీట్లతో పాటు ఫొటోలూ షేర్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, నాగార్జున మరో ట్వీట్ చేశాడు. ‘మరికొన్ని గంటల్లో నా కోడలు సమంత’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో నాగార్జున, సమంతలు చిరునవ్వు చిందిస్తున్నారు.

  • Loading...

More Telugu News