పశ్చిమ గోదావరి : ఆర్యవైశ్యులను ఏమైనా అంటే కాళ్లు విరగ్గొట్టండి: కంచ ఐలయ్యపై మాగంటి బాబు ఆగ్రహం
- పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో ఆర్యవైశ్య కల్యాణ మండపం ప్రారంభోత్సవం
- కంచ ఐలయ్య తీరును ఖండించిన నేతలు
- ఆర్య వైశ్యులు స్మగ్లర్లు కాదు.. మీరే స్మగ్లర్లు
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐలయ్య నిన్న ఓయూలో ప్రసంగిస్తూ మరోసారి తన వాదాన్ని వినిపించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయనపై ఎంపీలు మాగంటి బాబు, టీజీ వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో ఆర్యవైశ్య కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఇరువురు నేతలు ప్రసంగిస్తూ కంచ ఐలయ్య క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఆర్యవైశ్యులను ఏమైనా అంటే కాళ్లు విరగ్గొట్టండని మాగంటి బాబు వ్యాఖ్యానించారు. ఆర్య వైశ్యులు స్మగ్లర్లు కాదని, అటువంటి పుస్తకాన్ని రాసి పది రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకున్న వారే స్మగ్లర్లని టీజీ వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.