ఢిల్లీ పోలీస్ స్టేషన్: పోలీసు అధికారి కుర్చీలో పొరపాటున కూర్చున్నా!: రాథేమా వివరణ

  • ఎస్ హెచ్ఓ కుర్చీ ఖాళీగా ఉండటంతో కూర్చున్నా
  • నేనెవరో ఆ అధికారికి తెలియదు
  • ఆ కుర్చీలో లేవమని ఆయన చెప్పారు

నిన్న ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి స్టేషన్ హౌస్ అధికారి (ఎస్ హెచ్ఓ) సంజయ్ శర్మ కుర్చీలో రాధేమా కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.  ఈ సంఘటనపై మీడియా ఎదుట రాధేమా వివరణ ఇచ్చారు. వాష్ రూం కోసమే తాను పోలీస్ స్టేషన్ లోకి వెళ్లానని, అక్కడ కుర్చీ ఖాళీగా ఉండటంతో కూర్చున్నానని చెప్పారు. అయితే, ఆ కుర్చీ ఎస్ హెచ్ఓ దని తనకు తెలియదని, పొరపాటున కూర్చున్నానని చెప్పారు.

 ఈ కుర్చీలో కూర్చుని ఉన్న తనను చూసిన అధికారి, ‘ఆ కుర్చీలో నుంచి లేవండి’ అని అడగడంతో, వెంటనే, ఆ కుర్చీ ఖాళీ చేశానని చెప్పారు. వాస్తవానికి, ఆ అధికారికి తానెవరో తెలియదని, ఢిల్లీ పోలీసులను అవమానపరచాలన్నది తన ఉద్దేశం కాదని ఈ సందర్భంగా రాధేమా వివరణ ఇచ్చారు.

 కాగా, నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ కు రాధేమా వెళ్లారు. ఆమెను చూడగానే  ఎస్ హెచ్ ఓ తన కుర్చీలో నుంచి లేచి రాధేమాను కూర్చోమన్నారనే వార్తలు మీడియాలో ప్రసారం అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో విమర్శల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో  ఎస్ హెచ్ ఓ సంజయ్ శర్మను తొలుత బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News