సుప్రీంకోర్టు: సదావర్తి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ

  • సదావర్తి భూముల వ్యవహారంలో తమిళనాడు సర్కార్ పిటిషన్
  • వేలం జరిగిన భూములు తమ పరిధిలోనే ఉన్నాయన్న తమిళనాడు
  • కేసు హైకోర్టుకు బదిలీ
  • భూ యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఎన్నో ట్విస్టులు ఎదుర‌వుతోన్న సదావర్తి భూముల వ్యవహారంలో త‌మిళ‌నాడు స‌ర్కారు కూడా పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. వేలం జరిగిన భూములు తమ పరిధిలోనే ఉన్నాయని, ఆ కారణంతో తమను కూడా ఈ విచారణలో ఇంప్లీడ్ చేసుకోవాలని తమిళనాడు సర్కారు కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేసింది. ఈ రోజు దానిపై విచారించిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను విచార‌ణ‌కు స్వీకరిస్తున్న‌ట్లు తెలిపింది. ఏపీ, త‌మిళ‌నాడుల్లో భూ యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని ఆదేశిస్తూ ఈ కేసును ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ ఆదేశాల‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసింది.

  • Loading...

More Telugu News