: కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్ కు సుప్రీం పచ్చజెండా


దేశానికి అణు విద్యుత్ అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని మిగతా వనరులతో పోలిస్తే అణువిద్యుత్ చాలా తక్కువ ధరకే లభిస్తుందని పేర్కొంది. కూడంకుళం ప్లాంట్ కు సంబంధించి 17 భద్రతా ఏర్పాట్లలో 12 ఇప్పటికే పూర్తి చేశారని, కాలుష్యం పెరుగుతుందని, ప్లాంట్ వల్ల ప్రమాదం ఉందని కమిటీలు తేల్చలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించేందుకు అనుమతించింది.

  • Loading...

More Telugu News