సమంత: ‘సమంత-నాగచైతన్య పెళ్లి’ ఫొటో.. మార్ఫింగ్ ఫొటో చూసి మురిసిపోయిన సమంత.. మీరూ చూడండి!

  • పెళ్లికి స‌ర్వం సిద్ధ‌ం
  • ఈ రోజు కూడా ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేస్తోన్న సమంత
  • ఫొటోను మార్పింగ్ చేసి నాగ చైత‌న్య‌- స‌మంతల పెళ్లి ఫొటో పోస్ట్ చేసిన అభిమాని
  • చాలా ముద్దుగా ఉందన్న సమంత

సినీ అభిమానుల్లో ఇప్పుడు అక్కినేని నాగ చైత‌న్య‌- స‌మంతల వివాహం అంశ‌మే హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. వారి పెళ్లికి స‌ర్వం సిద్ధ‌మైపోయింది. ఇంత బిజీగా ఉండి కూడా పెళ్లి కూతురు స‌మంత ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేస్తోంది. ఓ అభిమాని ఓ ఫొటోను మార్పింగ్ చేసి నాగ చైత‌న్య‌- స‌మంతల పెళ్లి ఫొటోను ట్వీట్ చేశాడు.

ఆ ఫొటో చూసుకుని స‌మంత మురిసిపోయింది. ఈ ఫొటో చాలా ముద్దుగా ఉంద‌ని స‌మంత రీ ట్వీట్ చేసింది. ఈ పెళ్లి ఫొటోలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ అంతా క‌న‌‌బ‌డుతున్నారు. ఓ ప‌క్క విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా నిల‌బ‌డ్డాడు. నాగార్జున అక్షింతలు వేస్తుండ‌గా, అఖిల్ మాత్రం అన్న‌పై స్టైలుగా చేయివేశాడు.

కాగా, మరి కొన్ని గంటల్లో చైతూ-శామ్ ల జంట ఒక్క‌టి కాబోతోంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం జ‌రగ‌నుంది. ఇప్పుడు ఇరు కుటుంబాల స‌భ్యులు గోవాలో ఉన్నారు.

  • Loading...

More Telugu News