సింగరేణి: ‘సింగరేణి’ ఎన్నికల్లో 94.93 శాతం పోలింగ్.. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు!

  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
  • గనుల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో పోలింగ్
  • ఈ రోజు అర్ధరాత్రికి పూర్తి ఫలితాలు

సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. సింగరేణి వ్యాప్తంగా 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 ఓట్లు పోలైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాత్రి 9 గంటల కల్లా ఏదో ఒక డివిజన్ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అర్థరాత్రి 12 గంటలకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

కాగా, గనుల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నిక నిమిత్తం మొత్తం 92 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. టీబీజీకేఎస్ తో పాటు మరో 15 కార్మిక సంఘాలు ఈ ఎన్నికలో పోటీపడ్డాయి. అయితే, టీబీజీకేఎస్-ఏఐటీయూసీ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

  • Loading...

More Telugu News