షారూక్: షారూక్ ఖాన్ తో హరీష్ శంకర్ భేటీ!
- షారూక్ ను కలవడం మరచిపోలేను
- గుర్తుండిపోయే సంభాషణ చేసిన బాద్ షా కు ధన్యావాదాలు
- ట్వీట్ లో హరీష్ శంకర్
బాలీవుడ్ అగ్ర నటుడు షారూక్ ఖాన్ ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కలిశారు. ఈ సందర్భంగా హరీష్ ట్వీట్ చేస్తూ, ‘నా జీవితంలో మరచిపోలేని సమయం, గుర్తుండిపోయే సంభాషణ చేసిన కింగ్ ఖాన్ కు ఎన్నో ధన్యవాదాలు.. లవ్ యూ’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా షారూక్ ను హరీష్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, షారూక్ ఖాన్ ని తాను ఏ సందర్భంలో, ఎక్కడ కలిశారనే విషయాన్ని హరీష్ ప్రస్తావించలేదు.