శ్రీలంక: శ్రీలంక క్రికెటర్ పై నిషేధం విధించిన లంక బోర్డు!

  • ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టిన ధనుష్క గుణతిలక
  • గుణతిలకపై ఆరు మ్యాచ్ ల నిషేధం
  • లంక బోర్డు ప్రతినిధుల ప్రకటన

ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడమే కాకుండా ఓ నైట్ పార్టీలో ఎక్కువ సమయం గడిపిన శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకపై లంక బోర్డు వేటు వేసింది. గుణతిలకపై ఆరు మ్యాచ్ ల నిషేధాన్ని విధిస్తున్నట్టు లంక బోర్డు ప్రతినిధులు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం శ్రీలంక జట్టు యూఏఈ వేదికగా పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం సాధించింది. రెండో టెస్టు రేపటి నుంచి ప్రారంభం కానుంది. నిషేధం కారణంతో ఈ రెండో టెస్టుకు గుణతిలక దూరమవుతున్నాడు.

ఇదిలా ఉండగా, శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనలను గుణతిలక ఉల్లంఘించడం ఇదేమీ తొలిసారి కాదు. శ్రీలంక- భారత్ జట్ల మధ్య ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ కు తన బ్యాటింగ్ కిట్ ను గుణతిలక మర్చిపోయి రావడం విమర్శలకు దారితీసింది.  

  • Loading...

More Telugu News