‘ట్విట్లర్’: ‘ట్విట్టర్’లో ప్రథమ స్థానం ట్రంప్.. మహిళా నేతల్లో సుష్మా స్వరాజ్!

  • రెండో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్
  • మూడో స్థానంలో భారత ప్రధాని మోదీ
  • ట్విప్లోమసీ నివేదిక వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న నేతగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్ ఉండగా, మూడో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచినట్టు ట్విప్లోమసీ నివేదిక వెల్లడించింది. ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ ఫాలోయర్ల సంఖ్య సుమారు 40 మిలియన్లు కాగా, పోప్ కు 39 మిలియన్లు, మోదీకి 35 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

కాగా, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఇండియా ట్విట్టర్ ఖాతా 21 మిలియన్ల మంది ఫాలోయర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మహిళా నేతల్లో అయితే, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. సుమారు 9.6 మిలియన్ల మంది ఫాలోయర్లతో సుష్మా స్వరాజ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News