సాహో: ఈ సినిమా చేసేంతవరకు ప్రభాస్ ఎవరో నాకు అంతగా తెలియదు: నటి శ్రద్ధాకపూర్

  • ‘సాహో’కు ఒప్పుకున్న తర్వాత రెండుసార్లే  ప్రభాస్ తో మాట్లాడా
  • ఆ తర్వాత షూటింగ్ లోనే కలిశా
  • ప్రభాస్ నిజంగా కింగే! 

‘బాహుబలి-2’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్ కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. తొలిసారిగా దక్షిణాది భాషా చిత్రంలో నటిస్తున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.

ఈ సినిమాలో నటించే వరకు ప్రభాస్ గురించి తనకు అంతగా తెలియదని చెప్పింది. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత, కేవలం, ఒకటి, రెండు సార్లు మాత్రమే ప్రభాస్ తో ఫోన్ లో మాట్లాడానని చెప్పింది. ఆ తర్వాత, షూటింగ్ లోనే ప్రభాస్ తో నేరుగా మాట్లాడానని చెప్పిన శ్రద్ధాకపూర్, ‘బాహుబలి’ చూశానని, ప్రభాస్ నిజంగా కింగే నంటూ ప్రశంసించింది.

  • Loading...

More Telugu News