‘కాలా’: ఆమె కోసం రజనీకాంత్ ఎన్నో రకాల వంటలు చేయించారట!
- ‘కాలా’ సెట్ లో నోరూరించే వంటకాలు
- వంటకాలు అద్భుతం! సూపర్ స్టార్ రజనీ సార్.. ధన్యవాదాలు
- నటి హ్యూమా ఖురేషి
పా. రంజిత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కాలా’. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి హ్యుమా ఖురేషి ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ సినిమా సెట్ లో రజనీకాంత్ తన కోసం నోరూరించే పలు రకాల వంటకాలను చేయించారని చెప్పింది.
అంతేకాదు, ఆ వంటకాలు ఉన్న పాత్రలన్నింటిని ఓ చోట చేర్చి ఫొటో తీసి, ఆ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘బెస్ట్ టీమ్ ‘కాలా’... వంటకాలు అద్భుతం.. సూపర్ స్టార్ రజనీ సార్ ధన్యవాదాలు’ అని హ్యుమా ఖురేషి సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ‘కాలా’లో గ్యాంగ్ స్టర్ పాత్రలో రజనీ నటిస్తుండగా, ఆయన భార్య పాత్రను ఈశ్వరీరావు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.