సాక్షి: ‘సాక్షి’ చైర్మన్, ఎడిటోరియల్ డైరెక్టర్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నూజివీడు కోర్టు
- ‘తెలుగు రైతు’ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులిపై అసత్య కథనాలు
- ఈ విషయమై పరువునష్టం దావా వేసిన బాధితుడు
- కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్
పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానందుకు సాక్షి పత్రిక చైర్మన్ భారతిరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపై కృష్ణా జిల్లా నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కృష్ణా జిల్లా ‘తెలుగు రైతు’ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులుపై ఇటీవల సాక్షి పత్రికలో కథనాలు వెలువడ్డాయి.
దీంతో, తనపై అసత్య కథనాలు ప్రచురించారని, ఈ కథనాలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ వారిపై ఆయన పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం భారతిరెడ్డి, రామచంద్రమూర్తి కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు సమాచారం.