మోహన్ బాబు: గౌరవ డాక్టరేట్‌ అందుకున్న డైలాగ్ కింగ్ మోహన్‌బాబు!

  • గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిన ఎంజీఆర్ యూనివర్శిటీ
  • ఈ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు పిల్లలు
  • తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ మంచి విష్ణు ట్వీట్

గౌరవ డాక్టరేట్ తో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబును ఎంజీఆర్ విశ్వవిద్యాలయం సత్కరించింది. చెన్నైలో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు, మోహన్ బాబుకు డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు.

‘ఎంజీఆర్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న నా హీరో, నా తండ్రి మోహన్ బాబుకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపింది. మోహన్ బాబు గౌరవ డాక్టరేట్ అందుకోవడం తమకు ఎంతో గర్వంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది. 

  • Loading...

More Telugu News