ఢిల్లీలో గొడవ: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కొట్టుకున్న ప్రయాణికులు.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసు!
- ఢిల్లీ అజాద్‌పూర్ మెట్రో స్టేషన్‌లో అలజడి
- గొడవను ఆపేందుకు వచ్చిన పోలీసుతో కూడా గొడవ పెట్టుకున్న వైనం
- పలువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీ అజాద్‌పూర్ మెట్రో స్టేషన్‌లో అలజడి చెలరేగింది. కొందరు ప్రయాణికులు గొడవపడి కొట్టుకుంటుండడంతో విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్ పోలీసు మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, కొంత మంది యువకులు మెట్రోస్టేషన్‌లో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అడ్డం వచ్చిన పోలీసుతో కూడా గొడవపడ్డారు. దీంతో ఆ పోలీసు గాల్లోకి కాల్పులు జరిపాడు. మరికొంత మంది పోలీసులు అక్కడకు చేరుకుని గొడవ పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.