చినజీయర్ స్వామి: చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నా: వైఎస్ జగన్
- పాదయాత్రకు స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నా
- ట్విట్టర్ లో పేర్కొన్న జగన్
- స్వామీజీతో కలిసి ఉన్న ఫొటోలు పోస్ట్ చేసిన వైసీపీ అధినేత
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపిన జగన్, చినజీయర్ స్వామితో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. ‘నా పాదయాత్ర ప్రారంభించడానికి ముందు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిగారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నా’ అని ఆ ట్వీట్ లో జగన్ పేర్కొన్నారు.