కేసీఆర్: పయ్యావులతో కేసీఆర్ ఏకాంత సంభాషణపై స్పందించిన జేసీ!
- రహస్య మంతనాలని నేనైతే అనుకోను
- దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడంలో అర్థం లేదు
- మా అందరికీ కేసీఆర్ బాగా తెలుసు
ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ పెళ్లికి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తో ఏకాంతంగా జరిపిన సంభాషణ విషయమై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించగా, ‘రహస్య మంతనాలని నేనైతే అనుకోను. మా అందరికీ కేసీఆర్ బాగా తెలుసు. మమ్మల్ని అందరినీ పేరుపెట్టి పిలుస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ‘ఏమయ్యా, కేశవ్ ఎట్లా ఉన్నావు?’ అంటూ భుజం మీద చేయి వేసుకుని అలా పక్కకుపోయాడు. అంతేగానీ, దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడంలో అర్థం లేదు’ అని జేసీ చెప్పుకొచ్చారు.