రజనీకాంత్: రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!
- రజనీకాంత్ త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారు
- రాజకీయాల్లోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుంది
- విలేకరుల సమావేశంలో లతా రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఆయన భార్య లతా రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, ఆయన రాజకీయాల్లోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుందని, కచ్చితంగా విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు.
కాగా, శ్రీ దయా ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఆమె నిర్వహిస్తున్నారు. చెన్నైలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా రజనీ రాజకీయాల్లోకి రావడంపై ఓ విలేకరి ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు.