అగ్రిగోల్డ్: ‘అగ్రిగోల్డ్’ చైర్మన్ వెంకట రామారావుకు మూడేళ్ల జైలు శిక్ష

  • భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ రామారావు
  • జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేల్ కోర్టు తీర్పు
  • కడప సెంట్రల్ జైలుకు తరలింపు

భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన కేసులో ‘అగ్రిగోల్డ్’ చైర్మన్ వెంకట రామారావుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కడప జిల్లా బద్వేల్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో 300 ఎకరాల భూముల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపింది. వెంకట రామారావు అవకతవకలకు పాల్పడినట్టు నిర్ధారించిన కోర్టు ఈ రోజు ఆయనకు మూడేళ్ల జైలు, జరిమానా విధించింది. దీంతో, వెంకట రామారావును కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News