వీహెచ్: ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డ కాంగ్రెస్ నేత వీహెచ్!
- హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘటన
- ఎవరిమాటా వినకుండా రాంగ్ రూట్లోనే వెళ్లిన వీహెచ్
- ట్రాఫిక్ పోలీసులతో గొడవ
హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి రోడ్లపై నీరు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కాగా, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి రోడ్డుపై కారులో వెళుతోన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డారు.
అన్ని కార్లు ఎడమవైపు నుంచి ముందుకు వెళుతోంటే ఆయన కారు మాత్రం కుడివైపు నుంచి వెళ్లసాగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపగా, వారితో వీహెచ్ గొడవ పెట్టుకున్నారు. ఎవరిమాటా వినకుండా అలాగే కారుని ముందుకు పోనిచ్చారు.