అక్కినేని: మరో రెండు రోజుల్లో నాగచైతన్య-సమంత వివాహం: నాగార్జున
- సింపుల్ గా పెళ్లి వేడుక
- క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం
- కేవలం 100 మంది మాత్రమే హాజరవుతారట
సినీనటులు అక్కినేని నాగ చైతన్య, సమంతల వివాహానికి ముహూర్తం దగ్గరపడింది. వారి పెళ్లి గురించి చైతూ తండ్రి, నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... మరో రెండు రోజుల్లో నాగచైతన్య- సమంత వివాహం జరుగుతుందని అన్నారు. పెళ్లి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేయాలని చైతన్య తనను అడిగాడని చెప్పారు. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపిస్తున్నామని ప్రకటించారు. ఈ పెళ్లికి 100 మంది మాత్రమే హాజరవుతారని అన్నారు.
కాగా, కొన్నేళ్లుగా నాగచైతన్య, సమంత ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గానూ ఉంది. గోవాలో వారి పెళ్లి జరగనుంది.