కట్టప్ప: చిన్నారి ‘కట్టప్ప’ ఫొటో పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తనయుడు
- నేడు సత్యరాజ్ పుట్టినరోజు
- నటనే కాదు మానవత్వం ఉన్న వ్యక్తి అన్న శిబిరాజ్
- చిన్నప్పటి ఫొటోలో ముద్దులొలుకుతున్న కట్టప్ప
దక్షిణాది భాషా నటుడు సత్యరాజ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ఓ ట్వీట్ ద్వారా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేసి మరీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
ఈ ఫొటోలో చిన్నారి సత్యరాజ్ ఎంతో అందంగా ఉన్నాడు. ‘కేవలం తన నటన ద్వారానే కాకుండా తన మానవత్వంతో వేలాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు # హెచ్బీడి సత్యరాజ్, # కట్టప్ప’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.