హైదరాబాద్: సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు
- అధికారులతో సమీక్ష నిర్వహించిన కేటీఆర్
- విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలని ఆదేశం
హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, సహాయక చర్యల నిమిత్తం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, వర్షపు నీటిని మోటార్లతో తోడిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. నాలాల వైపు వాహనదారులు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న జనార్దన్ రెడ్డి తెలిపారు.