వర్షపాతం: హైదరాబాద్ లో వర్షపాతం వివరాలు!
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- రాజేంద్రనగర్ లో అత్యధికంగా 8.3 సెం.మీ వర్షపాతం నమోదు
హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మెహిదీపట్నం, పెన్షన్ ఆఫీస్ ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు..రాజేంద్రనగర్ లో అత్యధికంగా 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అంబర్ పేట్ లో 7 సెం.మీ, ఆసిఫ్ నగర్, గోల్కొండలలో 6.8 సెం.మీ, బహుదూర్ పురాలో 6.7 సెం.మీ, చార్మినార్ లో 6 సెం.మీ, నారాయణగూడలో 6 సెం.మీ, అమీర్ పేట్, ముషీరాబాద్ లలో 5.5 సెం.మీ, మాదాపూర్ లో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.