హైదరాబాద్: ఫిల్మ్ నగర్ లో రెండు తలల పాము కలకలం!
- రోడ్డుపై కనిపించిన రెండు తలల పాము
- దీనిని చూసేందుకు ఆసక్తి చూపిన ప్రజలు
- పామును పట్టుకువెళ్లిన స్నేక్ సొసైటీ సభ్యులు
హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో రెండు తలల పాము కలకలం రేపింది. రోడ్డుపైకి వచ్చిన ఈ పామును చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. దీంతో, రోడ్డుపై ట్రాఫిక్ కొంచెం సేపు స్తంభించిపోయింది. అయితే, ఈ మేరకు సమాచారం అందుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు అక్కడికి వెళ్లారు. రెండు తలల పామును పట్టుకుని తీసుకువెళ్లారు.