మురళీ విజయ్: మరో బిడ్డకు తండ్రయిన క్రికెటర్ మురళీ విజయ్

  • మురళీ విజయ్ కి ఇప్పటికే ఓ కుమారుడు, కూతురు
  • మరో కుమారుడు పుట్టాడని విజయ్ సంబరం
  • తన చిన్న కుమారుడిని పెద్ద కుమారుడు పరిచయం చేస్తున్నాడని ట్వీట్

టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ మరోసారి తండ్రయ్యాడు. తన భార్య నిఖిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఆయ‌న చెప్పాడు. విజ‌య్‌, నిఖిత దంప‌తుల‌కు ఇప్ప‌టికే ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ రోజు పుట్టిన త‌న మూడవ బిడ్డ‌ను త‌న పెద్ద కుమారుడు ఎత్తుకోగా తీసిన ఫొటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘ఇద్ద‌రు రాక్‌స్టార్‌లు.. అందులో ఒక‌రు మ‌రొక‌రిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.

ముర‌ళీ విజ‌య్‌, నిఖిత‌కి 2012లో వివాహం జ‌రిగింది. టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగుతోన్న ముర‌ళీ విజ‌య్‌.. వ‌న్డేల్లో మాత్రం చోటు సంపాదించ‌లేక‌పోతున్నాడు. గాయంతో బాధ‌ప‌డుతోన్న ముర‌ళీ విజ‌య్ ఇటీవ‌ల శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో, ఐపీఎల్ 2017లో ఆడ‌లేదు. కొన్ని నెల‌ల క్రితం ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో ముర‌ళీ విజయ్ చివరిసారిగా ఆడాడు.

  • Loading...

More Telugu News