షారూక్ ఖాన్: కొన్ని రాత్రుళ్లు మనతో ఉన్న స్టార్సే ఎక్కువగా మెరిసిపోతుంటారు.. : షారూక్ ఖాన్

  • బాలీవుడ్ హీరోయిన్లతో సెల్ఫీ, ఫొటో దిగిన షారూక్
  • ‘థ్యాంక్యూ లేడీస్’ అంటూ బాద్ షా సంతోషం

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. బాలీవుడ్ నటీమణులతో కలిసి షారూక్ దిగిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీదేవి, కాజోల్, రాణీముఖర్జీ, కరిష్మాకపూర్, ఆలియా భట్ తో కలిసి షారూక్ ఫొటోకు పోజిచ్చాడు.

కాజోల్, రాణీ ముఖర్జీ తో కలిసి షారూక్ సెల్ఫీ దిగగా, కరిష్మాకపూర్, శ్రీదేవి, ఆలియాభట్ తో కలిసి ఫొటో దిగాడు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్ లో షారూక్ ఏమన్నాడంటే.. ‘కొన్ని రాత్రుళ్లు ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే మనతో ఉన్న స్టార్సే ఎక్కువగా మెరిసిపోతుంటారు. ప్రేమ, అందంతో కూడిన మీ దయార్థ్రతకు థ్యాంక్యూ లేడీస్’ అని షారూక్ పేర్కొన్నాడు. కాగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్వార్ఫ్’ చిత్రంలో షారూక్ ఖాన్ నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News