వర్షం: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్

  • తీవ్రంగా ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు
  • ద‌ట్టంగా క‌మ్ముకున్న మేఘాలు
  • ప‌లు చోట్ల మెరుపులు, ఉరుముల‌తో కూడిన వ‌ర్షం

ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఖైరతాబాద్‌, కోఠి, నాంపల్లి దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, నాచారం, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్‌, యూస‌ఫ్‌గూడ‌లో భారీ వ‌ర్షం ప‌డుతోంది. ప‌లు చోట్ల మెరుపులు, ఉరుముల‌తో కూడిన వ‌ర్షం కురుస్తోంది.

ఆకాశంలో మేఘాలు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయి. దీంతో చీక‌టి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప‌లుచోట్ల డ్రైనేజీలు, నల్లాలు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాహ‌న‌దారులు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. 

  • Loading...

More Telugu News