లాస్ వెగాస్: అమెరికాలో కాల్పుల బీభత్సం: 50కి చేరిన మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గాయాలు
- మండాలే బే హోటల్‌లో దుండగుడి కాల్పులు
- దుండగుడు లాస్ వెగాస్ వాసేనని సమాచారం
అమెరికా లాస్‌వెగాస్‌లోని మండాలే బే హోటల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 50కి పెరిగిందని అక్కడి అధికారులు ప్రకటించారు. కాల్పులు జరిపిన దుండగుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 200 మందికి పైగా గాయాలు అయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. దుండగుడు ఓ గదిలో ఉండి ఈ కాల్పులకు పాల్పడ్డాడని ఆ గదిలో పెద్ద ఎత్తున తుపాకులు కూడా లభ్యమయ్యాయని చెప్పారు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడు లాస్ వెగాస్ వాసేనని సమాచారం.