‘స్వచ్ఛతే సేవ’: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి భారీగా నిధులు కేటాయిస్తున్న చంద్రబాబు: మంత్రి లోకేశ్

  • అమరావతిలో ‘స్వచ్ఛతే సేవ’ లో పాల్గొన్న లోకేశ్
  •  మూడేళ్లలో గ్రామాల్లో 13 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం
  • 3,995 పంచాయతీల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం

ఏపీ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబునాయుడు భారీగా నిధులు కేటాయిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్లు అవుతున్నా గ్రామాల్లో సమస్యలు ఇంకా ఉన్నాయని అన్నారు.

గత మూడేళ్లలో గ్రామాల్లో 13 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించామని, 3,995 పంచాయతీల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని అన్నారు. 2019 నాటికి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. గ్రామాల్లో ‘స్వచ్ఛ పంచాయతీ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, ‘స్వచ్ఛ ఏపీ’లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపు నిచ్చారు. ఏపీని త్వరలోనే బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News