స్పైడర్: థియేటర్‌లోనే కొట్టుకున్న మహేశ్ బాబు అభిమానులు.. చివరకు స్పైడర్ సినిమా ఫస్ట్ షో రద్దు

  • కరీంనగర్ జిల్లాలోని వెంకటేశ్వర సినిమా హాల్లో ఘటన
  • ఆన్‌లైన్‌లో విక్ర‌యించిన టిక్కెట్లను మళ్లీ థియేటర్ వద్ద అమ్మిన సిబ్బంది
  • సీటు తమదేనంటూ ఇద్దరు అభిమానుల గొడవ
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యం

‘స్పైడర్’ సినిమా చూడడానికి వచ్చిన ఇద్దరు మహేశ్ బాబు అభిమానులు థియేటర్ లోనే తన్నుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలోని వెంకటేశ్వర సినిమా హాల్లో చోటు చేసుకుంది. వారిద్ద‌రు గొడ‌వ ప‌డ‌డంతో ఆ థియేట‌ర్ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం గురించి అందరికీ తెలిసి వ‌చ్చింది. చివ‌రికి నిన్న ఫ‌స్ట్ షోను నిలిపివేయాల్సి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ‘స్పైడర్’ సినిమాకి సంబంధించి ఫస్ట్ షో టికెట్లను కొన్నింటిని ఆన్‌లైన్‌లో విక్ర‌యించారు.

అవే సీటు నెంబ‌ర్ల‌తో టికెట్ల‌ను మళ్లీ సినిమా థియేట‌ర్‌ వద్ద కౌంటర్‌లో కూడా అమ్మారు. దీంతో ఒకే నెంబ‌రుతో టికెట్లు ఇద్దరిద్ద‌రికి వ‌చ్చాయి. సీటు కోసం థియేట‌ర్‌లో గొడ‌వ‌ప‌డిన యువ‌కులు యాజ‌మాన్యం వ‌ద్ద‌కు వెళ్ల‌గా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చాలా మందికి ఇలాగే టికెట్లు అందాయ‌ని తెలుసుకున్న థియేట‌ర్ యాజ‌మాన్యం ఫ‌స్ట్ షోను నిలిపేసింది. 

  • Loading...

More Telugu News