రేణు: అక్కాతమ్ముళ్లం ఒకే రంగు దుస్తులు వేసుకున్నాం: రేణూ దేశాయ్ కామెంట్
- ‘నీతోనే డ్యాన్స్ షో’లో జడ్జిగా కనిపించిన రేణూ దేశాయ్
- షోలో కనిపించిన ‘వైవా’ హర్ష
- మ్యాచింగ్ పింక్ కలర్ దుస్తులు వేసుకున్న హర్ష, రేణూ దేశాయ్
నటి, ప్రొడ్యూసర్ రేణూ దేశాయ్ స్టార్ మా టీవీలో మొన్న ప్రారంభమైన ‘నీతోనే డ్యాన్స్ షో’లో జడ్జిగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ షోలో నటుడు, యూ ట్యూబ్లో ‘వైవా’ షార్ట్ ఫిలింతో పాప్యులర్ అయిన హర్ష కూడా కనిపించాడు.
ఈ సందర్భంగా హర్షతో దిగిన ఫొటోను రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది. ‘డ్యాన్స్ గురూజీతో మ్యాచింగ్ పింక్ కలర్లో అక్కాతమ్ముడు’ అని ఆమె పేర్కొంది. మొన్న ప్రారంభమైన ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ డ్యాన్స్షోకి గెస్ట్ గా వచ్చి హర్ష చేసిన కామెడీ ఆకర్షించింది. చాలా ఏళ్ల తరువాత రేణూ దేశాయ్ మళ్లీ ప్రేక్షకుల ముందు వచ్చి అలరించింది.