అర్జున్ రెడ్డి: ‘అర్జున్ రెడ్డి’కి ముందు నన్నే అడిగారు.. చేయనందుకు బాధగా ఉంది!: హీరో శర్వానంద్

  • ఈ సినిమా కథను ముందుగా నాకే వినిపించారు
  • నిర్మాత, దర్శకుడు ఒకరే అయితే నటించనని చెప్పాను
  • విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడు

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించనందుకు తనకు బాధగా ఉందని హీరో శర్వానంద్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అర్జున్ రెడ్డి’ సినిమా కథను ముందుగా తనకు వినిపించారని, కానీ, నటించేందుకు తాను ఒప్పుకోలేదని చెప్పాడు.

ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు ఒకరే అయితే తాను చేయనని, నిర్మాత బాధ్యతలు కూడా దర్శకుడిపై పడితే సరిగా న్యాయం చేయలేరని తాను అప్పుడు అనుకున్నానని చెప్పాడు. ఇక, ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడని, ఈ సినిమాను సరైన నటుడే చేశాడని చెప్పిన శర్వానంద్, ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ అని ప్రశంసించాడు.

  • Loading...

More Telugu News