ఐదో వన్డే: రోహిత్ శర్మ రికార్డు.. వన్డేల్లో ఆరువేల పరుగులు పూర్తి
- వన్డే కెరీర్ లో 14వ శతకం చేసిన శర్మ
- ఆరువేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత క్రికెటర్ గా రికార్డు
నాగ్ పూర్ వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతకం బాదాడు. ఈ వన్డే తో మరో రికార్డు కూడా శర్మ సొంతం చేసుకున్నాడు. వన్డే కెరీర్ లో 14వ సెంచరీ చేసిన శర్మ, వన్డేల్లో ఆరువేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో, వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డుల కెక్కాడు.
కాగా, క్రీజ్ లో రోహిత్ శర్మ భాగస్వామిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. 243 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, 37.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 212 పరుగులు చేసింది. విజయ లక్ష్యానికి టీమిండియా అతి చేరువలో ఉండటంతో అభిమానులు కేరింతలు కొడుతున్నారు.