ఫ్రాన్స్: ఫ్రాన్స్ రైల్వేస్టేషన్ లో దుండగుడి వీరంగం.. ఇద్దరి మృతి!

  • మార్సెల్లీ రైల్వేస్టేషన్ లో దారుణం
  • కత్తితో దాడి.. ఇద్దరి మృతి, పలువురికి గాయాలు
  • పోలీసు కాల్పుల్లో దుండగుడి హతం

ఫ్రాన్స్ లోని ఓ రైల్వే స్టేషన్ లో దుండగుడు రెచ్చిపోయాడు. మార్సెల్లీ రైల్వేస్టేషన్ లో దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.

ఈ ఘటనతో మార్సెల్లీ స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సమీప ప్రాంతాల్లోని వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రహదారులను మూసి వేశారు. ఇదిలా ఉండగా, మార్సెల్లీ రైల్వేస్టేషన్ ఘటనపై ప్రత్యక్షసాక్షులు స్పందిస్తూ, రైల్వేస్టేషన్ లో కాల్పుల శబ్దం కూడా వినపడిందని, ఆ తర్వాత దుండగుడు కత్తితో దాడిచేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News