lచివరి వన్డే: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
- రహానె (61) అవుట్
- కొనసాగుతున్న శర్మ, కోహ్లీ
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. నైల్ బౌలింగ్ లో రహానె (61) ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఏడు ఫోర్లు కొట్టిన రహానె అవుట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. క్రీజ్ లో రోహిత్ శర్మకు జతగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 75 పరుగులు చేసిన శర్మ, పది ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. కోహ్లీ పద్నాలుగు పరుగులతో ఉన్నాడు. 28 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్: 151/1