టీడీపీ: టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తో సీఎం కేసీఆర్ ఏకాంత సంభాషణ!

  • పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం
  • పయ్యావులతో ఐదారు నిమిషాల పాటు కేసీఆర్ సంభాషణ
  • ఏపీ రాజకీయాలు, ఇటీవల జరిగిన ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం

ఈ రోజు అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఈ వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తో కొంచెం సేపు మాట్లాడినట్టు సమాచారం. ఐదారు నిమిషాల పాటు ఆయనతో కేసీఆర్ ఏకాంతంగా సంభాషించారని, ముఖ్యంగా, ఏపీ రాజకీయాలపైన, ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికలపైనా ఆరా తీశారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల గురించీ పయ్యావులతో కేసీఆర్ మాట్లాడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News