బనగానపల్లె: ఎస్ఆర్ బీసీ ప్రధాన కాల్వకు గండి... బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ లోకి చేరిన నీరు!
- వృథాగా పోతున్న నీరు
- పలు కాలనీల్లోకి చేరిన నీరు ..
- ఇబ్బందిపడుతున్న కాలనీవాసులు
కర్నూలు జిల్లాలోని బనగానపల్లె సమీపంలో ఎస్ఆర్ బీసీ ప్రధాన కాల్వకు గండి పడింది. ప్రధాన కాల్వ నుంచి వృథాగా నీరు పోతోంది. దీంతో, బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్, పెండేకంటినగర్ తో పాటు పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్ లోకి భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తమ కాలనీల్లోకి నీరు చేరడంతో కాలనీవాసులకు దిక్కుతోచడం లేదు.