: అఫ్జల్ కు ఉరి సరైనదే: వెంకయ్యనాయుడు
దేశ భద్రతకు సవాలు విసిరిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడం సరైన చర్యేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఉగ్రవాదులను శిక్షించడంపై నిరసన తెలుపుతున్న మానవ హక్కుల సంఘాలు, ఉగ్రవాదుల హింసాత్మక చర్యలను ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఉగ్రవాది అఫ్జల్ కు విధించిన ఉరిశిక్ష రాజకీయమైందా? కాదా? అనేది ముఖ్యం కాదన్న ఆయన... ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసిన వ్యక్తికి అనుకూలంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని ప్రశ్నించారు. కాశ్మీరులో ఏదో జరుగుతోందని దేశ భద్రతను దెబ్బతీసుకుంటామా? అని వెంకయ్య నాయుడు అన్నారు.