: కొవ్వు తగ్గించడానికి కొత్త మందు వచ్చేసింది
కొవ్వు (శరీరంలోని బ్యాడ్ కొలెస్టరాల్) ను తగ్గించడానికి ఇప్పటికే మార్కెట్లో అనేక రకాలు మందులు ఉన్నాయి. కొత్తవి ఆవిష్కృతం అవుతూనే ఉంటాయి. అయితే మార్కెట్లో దొరికే రెండు రకాల మందుల మిశ్రమంగా కొత్త మందు మిశ్రమం తాజాగా అమెరికా వారి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ వారి ఆమోదం పొందింది. ఈ మందు కొలెస్టరాల్‌ను తగ్గించగలదు గానీ.. దానివలన వచ్చే గుండెజబ్బుల వంటి ప్రమాదాలను అడ్డుకోలేకపోవచ్చునని రూపకర్తలు అంటున్నారు. మెర్క్‌కంపెనీ దీన్ని రూపొందించింది.
బ్యాడ్ కొలెస్టరాల్‌ను కట్టడిచేయడానికి మెర్క్ కంపెనీ వారి జెటియా అనే మందు ఇప్పటికే మార్కెట్లో ఉంది. దీనితో మరో జనరిక్ మందు లిపిటార్ ను మిశ్రమం చేశారు. లిఫ్ట్రూజెట్‌గా దీనికి పేరుపెట్టారు. లిపిటార్ కంటె మెరుగ్గా ఇది కొలెస్టరాల్ తగ్గించడంలో పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. లిఫ్ట్రూజెట్ తాలూకు వివరాలను ఎఫ్‌డీఏ అదికార ప్రతినిధి మోర్గాన్ లిసిన్‌స్కీ ప్రకటించారు.