వర్షం: హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
- రోడ్లన్నీ జలమయం
- స్తంభించిన ట్రాఫిక్ .. వాహనదారులకు ఇబ్బంది
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్, తార్నాక, బోయిన్ పల్లి, కూకట్ పల్లి, మియాపూర్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, దిల్ సుఖ్ నగర్, లాలాపేట్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.