amejon: మరోసారి అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. నాలుగు రోజుల పాటు ఆఫర్లు

  • దీపావ‌ళి సంద‌ర్భంగా మరోసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌
  • వ‌చ్చేనెల‌ 4 నుంచి 8 వ‌ర‌కు ఆఫ‌ర్లు
  • అన్ని రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లు

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ మ‌రోసారి త‌మ వినియోగ‌దారుల ముందుకు భారీ ఆఫ‌ర్ల‌తో రానుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా మరోసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు, వ‌చ్చేనెల‌ 4 నుంచి 8 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంతేగాక‌, సిటీ బ్యాంకు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తామ‌ని చెప్పింది.

ఈ ఆఫ‌ర్ల‌లో భాగంగా యాపిల్‌, శాంసంగ్‌, సోనీ, హెచ్‌పీ, ఎల్‌జీ, నోకియా వంటి బ్రాండ్ల ఉత్ప‌త్తుల‌పై కూడా డిస్కౌంట్లు అందుకోవ‌చ్చ‌ని తెలిపింది. గతంలో తాము అందించిన‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్ క‌న్నా అధికంగా ఆఫ‌ర్లు అందుకోవ‌చ్చ‌ని చెప్పింది.   

  • Loading...

More Telugu News