విరాట్ కోహ్లీ: కోహ్లీని కలిసిన మహిళా క్రికెటర్లు!

  • హర్మన్ ప్రీత్, మంథనతో ముచ్చటించిన కోహ్లీ
  • బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో ఫొటోలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని భారత మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంథన కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బెంగళూరులో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నిన్న జరిగిన నాల్గో వన్డే మ్యాచ్ అనంతరం, కోహ్లీని వారు కలిశారు. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన కోహ్లీ, వారితో కొంచెం సేపు ముచ్చటించారు. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే మ్యాచ్ అక్టోబర్ 1న నాగ్ పూర్ స్టేడియంలో జరగనుంది.

  • Loading...

More Telugu News