surgical strikes: సర్జికల్ స్ట్రయిక్స్ పై సినిమా, రెండు పుస్తకాలు!
- ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి నిన్నటికి ఏడాది
- సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో ఒక సినిమా, రెండు పుస్తకాలు
- ఉడీ పేరుతో తెరకెక్కుతున్న సినిమా
గత ఏడాది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు లభించింది. ఈ దాడులు నిర్వహించి నిన్నటికి అంటే సెప్టెంబర్ 28 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది.
ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్ పై ‘ఉడీ’ పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి అధియా ధార్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. సర్జికల్ స్ట్రయిక్స్ టీమ్ కి నాయకత్వం వహించిన కమాండర్ గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు.
అలాగే ఈ దాడుల నేపథ్యంతో ఇప్పటికే ఓ పుస్తకం రాగా, ఈ రోజు మరో పుస్తకం వస్తోంది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ లు రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలటరీ హీరోస్’ పుస్తకం ఇప్పటికే విడుదల అయింది. ఇక, జర్నలిస్ట్, రచయిత నితిన్ గోఖలే రాసిన ‘ఇన్ సెక్యూరింగ్ ఇండియా ది మోదీ వే: పఠాన్ కోట్, సర్జికల్ స్ట్రయిక్స్ అండ్ మోర్’ అనే పుస్తకాన్ని నేడు ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు.