నాల్గో వన్డే: నాల్గో వన్డే లో భారత్ పరాజయం.. 21 పరుగుల తేడాతో ఆసీస్ విజయం!
- బోణీ కొట్టిన ఆసీస్
- ఆస్ట్రేలియా స్కోర్: 334/5
- భారత్ స్కోర్: 313/8
బెంగళూరు వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డేలో ఆసీస్ జట్టు విజయం సాధించింది. టీమిండియాపై 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఈ విజయాన్ని కైవసం చేసుకుంది. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై గెలిచి బోణీ కొట్టింది. దీంతో, ఐదు వన్డేల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది.
ఆస్ట్రేలియా స్కోర్: 334/5 (50 ఓవర్లలో)
భారత్ స్కోర్: 313/8 (50 ఓవర్లలో)
టీమిండియా బ్యాటింగ్:రహానె (53), రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (21), పాండ్యా (41), జాదవ్ (67), ఎంకే పాండే (33), ధోనీ (13), పటేల్ (5), మహ్మద్ షమీ 6 పరుగులతో, ఉమేష్ యాదవ్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఆసీస్ బౌలింగ్ : కమిన్స్ - 1, కౌల్టర్ - నీల్ - 2, రిచర్డ్ సన్ - 3, జాంపా - 1