సింగరేణి: డబుల్ ధమాకా... రెండు బోనస్ లూ రేపే అందుకోనున్న సింగరేణి కార్మికులు!

  • రెండు బోనస్ లూ రేపే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
  • దీపావళి బోనస్ కింద రూ.55 వేలు, లాభాల్లో 25 శాతం బోనస్ అందుకోనున్న సింగరేణి కార్మికులు
  • ఏర్పాట్లు పూర్తి చేశామన్న సింగరేణి సీఎండి

సింగరేణి కార్మికులకు రెండు బోనస్ లను రేపు చెల్లించాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి కార్మికులకు దీపావళి పండగ బోనస్ కింద రూ.55 వేలతో పాటు లాభాల్లో 25 శాతం బోనస్ గా చెల్లించాలని ఇటీవల సీఎం ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాల నేపథ్యంలో సింగరేణి సీఎండి శ్రీధర్ స్పందిస్తూ, ఈ రెండు బోనస్ లను కలిపి రేపు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News