నల్గొండ: నల్గొండకు ఉప ఎన్నిక వస్తే, పోటీకి నేను రెడీ!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి
- సోనియా ఆదేశిస్తే గుత్తాపై పోటీకి నేను రెడీ
నల్గొండ లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక రానుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఉపఎన్నిక కనుక వస్తే నల్గొండ అభివృద్ధికి నిధుల వరద వస్తుందని, అందుకే, ఉపఎన్నికను ఆహ్వానిస్తున్నామని అన్నారు.
నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే కనుక, ఆయనపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని, సోనియా గాంధీ ఆదేశిస్తే బరిలోకి దిగుతానని అన్నారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ ను గెలిపిస్తామని చెప్పిన వెంకట్ రెడ్డి, జిల్లాకు మెడికల్ కళాశాల కోసం తాను తలపెట్టిన దీక్ష వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. నల్గొండ జిల్లాకు ఎయిమ్స్, మెడికల్ కళాశాల కోసం పోరాడతామని అన్నారు.